JGL: దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు MLA సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.