VZM: యువత వ్యాపారవేత్తలుగా మారి మరికొంతమందికి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పిలుపునిచ్చారు. నెల్లిమర్ల పట్టణంలోని వేణుగోపాలపురం కాలనీలో సారిపల్లి శంకరరావు ఏర్పాటు చేసిన తులసి వాటర్ ప్లాంట్‌ని శుక్రవారం ఎమ్మెల్యే మాధవి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. యువత, డ్వాక్రా సభ్యులను వ్యాపార వేత్తలుగా మార్చడానికి ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పారు.