ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 18.4 ఓవర్లకు 125 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. మిచెల్ మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, జోష్ ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు తీశారు.