NZB: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందల్వాయి మండలం గన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు శుక్రవారం పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.