కృష్ణా: పెడనలోని శ్రీ గంగా పార్వతి సమేత అగస్తీశ్వరస్వామి దేవాలయంలో నిర్మించిన స్ట్రాంగ్ రూంను శుక్రవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయానికి చేరుకోగానే అర్చకులు, ట్రస్టు సభ్యులు ఆలయ మర్యాదలతో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు, అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.