JN: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ.. ఆయన 560 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి అఖండ భారత నిర్మాణానికి పునాది వేశారని నాయకులు తెలిపారు.