కృష్ణా: కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ.. జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ వీ.విద్యాసాగర్ నాయుడు, అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మచిలీపట్నంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసులు ఉత్సాహంగా పాల్గొని, మనమంతా సమానమే అని సందేశాన్ని ఇచ్చారు.