NLR: సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు బాలాజీ నగర్ త్యాగరాజ కళ్యాణ మండపంలో నవంబర్ 2వ తేదీ మహా రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా కార్తీక మాసంలో ఈశ్వరునికి మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి జరిగే పూజల్లో భక్తులు పాల్గొనాలని కోరారు.