GNTR: మంగళగిరి పట్టణంలోని అంబేదర్కర్ విగ్రహం ఎదురుగా ఉన్న టిఫిన్ హోటల్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దుకాణం పూర్తిగా దగ్ధమైంది. సమీప దుకాణదారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే అగ్నిమాపక శకటంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.