అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు ఆయనకి పుష్పగుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. నూతన ఆలయ పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగాలన్నారు.