GDWL: అలంపూర్ పట్టణం అభివృద్ధి లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహకారంతో వైద్యశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.44 లక్షలు మంజూరు చేయించినట్లు తెలంగాణ రాష్ట్ర టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు ఇస్మాయిల్ తెలిపారు. మున్సిపాలిటీకి వచ్చే ప్రతి పైసాను ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.