KMR: దేశ సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ రాజేష్ చంద్ర ప్రారంభించారు.