WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన వర్చుస్ వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో 400 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో రెండు బంగారు పతకాలు సాధించి దేశానికి గౌరవం తీసుకొచ్చింది. శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును దీప్తి మర్యాదపూర్వకంగా కలిశారు. దీప్తి విజయాలు గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు.