సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి కలిశారు. తన కుమార్తె డా. రచన రెడ్డి వివాహానికి ఆహ్వానించారు. ఈ మేరకు బాలయ్యకు పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన బాలకృష్ణ పెళ్లికి తప్పక వస్తానని చెప్పారు.