MDK: చేగుంట మండలం వడియారం ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కంపెనీ కార్మికులు సమ్మె విరమించారు. పరిశ్రమ ఢిల్లీ హెచ్ఆర్ సతీష్ తివారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వడియారం ప్లాంట్ డీజీఎం నిశాంత్, హెచ్ఆర్ మేనేజర్ వెంకటేశ్వర్లు, యూనియన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ కుల్ల నర్సింలు చర్చల్లో పాల్గొన్నారు.