WGL: తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక వైఖరితో అందరి మనసులు గెలుచుకున్నారు. హనుమకొండ సమ్మయ్య నగర్లో వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ధైర్యం చెబుతూ సహాయం అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారి పరిస్థితిని తెలుసుకున్నారు.