అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల నందు అధ్యాపకులు, విద్యార్థులు నేషనల్ యూనిటీ డేను ఇవాళ ఘనంగా జరుపుకున్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్. ఎస్ రామలింగారెడ్డి జెండా ఊపి యూనిట్ రన్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలన్నారు.