E.G: మద్దూరు జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం మొంథా తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆర్డీవో రాణి సుస్మిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మద్దూరు గ్రామానికి చెందిన 15 కుటుంబాలకు, కొవ్వూరు పట్టణానికి చెందిన 38 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశామని MLA తెలిపారు.