MBNR: పీయూ విద్యా కళాశాలలో ఎంఈడీ రెండవ సంవత్సరం విద్యార్థుల డిజర్టేషన్ వైవా పరీక్షలు ముగిశాయి. ఈ వైవా పరీక్షలకు డా. సునీత, డా. దుర్గేశం ఎగ్జామినర్లుగా హాజరై విద్యార్థులను పరీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. ఎ కరుణాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో పీహెచ్డీ పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా రాణించాలని అన్నారు.