GNTR: ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరు గ్రామంలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో దోమల నివారణ, ఆరోగ్య నియంత్రణ, నీటి నిల్వల శుభ్రతపై ప్రజలకు వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలకు నీటి నిల్వలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించవచ్చని అధికారులు వివరించారు.