E.G: వైద్య విద్యను కేవలం వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ MP మార్గాని భరత్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ నిర్వహిస్తున్న ‘కోటి సంతకాల సేకరణ’, ‘రచ్చబండ’ కార్యక్రమం రాజమండ్రి స్థానిక 48వ వార్డు పనసచెట్టు సెంటర్లో నిర్వహించారు.