ADB: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ గ్రామంలో పీఎం-జన్మన్ పథకం ద్వారా మంజూరైన రహదారి పనులను ఆయన పరిశీలించారు. పనులు తక్షణమే ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.