SRPT: మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షానికి మఠంపల్లిలో కప్పల వాగు ఉద్ధృతంగా పొంగిపొర్లుతోంది. దీని కారణంగా మఠంపల్లి నుంచి రఘునాథపాలెంకు వెళ్లే రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు ఉద్ధృతి దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల వల్ల మండలంలోని చాలాచోట్ల పంటలు నేలవాలయని రైతులు వాపోతున్నారు.