KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమావేశం నిర్వహించారు. వైద్య, విద్య, పోలీసు, ఎక్సైజ్, రవాణా, సంక్షేమ, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్ డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కళాశాల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.