ప్రకాశం: కొమరోలు మండలంలోని పామూరు పల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు అరటి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. బుధవారం పామురుపల్లిలోని అరటి పంటను ఉద్యాన శాఖ అధికారి శ్వేత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నష్టం వాటిల్లిన పంటల నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.