ASR: మొంథా తుఫాన్ ప్రభావంతో నేలమట్టమైన డుంబ్రిగూడ(M) వంతార్డ ఎంపీపీ పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ బుధవారం పరిశీలించారు. ప్రమాదకరంగా మారిన పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలను నెలరోజుల్లో కూల్చివేయాలని అధికారులకు ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాల వివరాలను త్వరితగతిన నివేదించాలని సంబంధిత అధికారులకు సూచించారు.