ASF: జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నివారణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.