‘OG 2’ మూవీని పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌తో తీస్తారా? అనే ప్రశ్నపై దర్శకుడు సుజీత్ స్పందించారు. ఈ విషయాన్ని పవన్‌ను అడగాలని, అకీరాతో తీస్తే హ్యాపీనే కదా అని అన్నారు. ‘OG’ సెట్స్‌కు అకీరా వచ్చారని, తనలో ఓ స్పార్క్ ఉందని తెలిపారు. ఇంతకుమించి తనేం చెప్పలేనని, ఏమైనా చెబితే అది ఎక్కడెక్కడికో వెళ్తుందని పేర్కొన్నారు.