KMR: మత్మల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారిణి డాక్టర్ శరత్ తెలిపారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా శుక్రవారం ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ రావు ఈ పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలున్న మహిళలకు మందులు పంపిణీ చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలు వాడమని సూచించారు.