BHPL: గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం సరస్సు కట్ట తెగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని SI అశోక్ స్పష్టం చేశారు. సరస్సు నీటి మట్టం 27 అడుగుల వద్ద ఉందని, కట్ట పూర్తిగా సురక్షితంగా ఉందని ఆయన తెలిపారు. ఎవరైనా ఫేక్ వీడియోలు లేదా సమాచారాన్ని షేర్ చేస్తే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.