SRCL: మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. నేడు ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 18న ముగుస్తుందని వివరించారు. అక్టోబర్ 23న దుకాణాల లైసెన్స్ కేటాయించేందుకు డ్రా తీస్తామన్నారు. డిసెంబర్ 1న నూతన లైసెన్స్‌లతో మద్యం దుకాణాలు కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.