VZM: కొత్తవలసలోని అప్పన్నపాలెంలో ఉన్న జిందాల్ పరిశ్రమ మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఈమేరకు శుక్రవారం విశాఖ జాయింట్ లేబర్ కమిషనర్‌తో టీఎన్టీయూసీ అధ్యక్షులు లెంక శ్రీను కార్మికుల సమక్షంలో చర్చలు జరిపారు. కార్మికులకు కంపెనీ తెరవకముందే జీతాలు వేస్తామని కమిషనర్ కార్మికులకు హామీ ఇచ్చారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు.