జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్ జీత్ గోసల్ హెచ్చరికలు జారీ చేశారు. ‘దోవల్ నేను మీ కోసం ఎదురు చూస్తున్నా. ఖలీస్తానీ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ వెంటే నేను ఉంటా. నవంబర్-23న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించడానికి పని చేస్తా. ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది’ అని బెదిరించాడు.