ADB: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అత్యంత భక్తిశ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారక నగర్లో గల ఉద్దం నవ దుర్గ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత వద్ద శుక్రవారం సాముహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. సామూహిక కుంకుమార్చనకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.