NDL: పీఎం సూర్య ఘర్ పథకాన్ని సమగ్రంగా అమలు చేసి, నిర్ణీత లక్ష్యాన్ని పూర్తి చేయడమే కాకుండా దానిని అధిగమించేలా కృషి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి మండల స్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం అమలు ప్రగతిని సమీక్షించారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.