MBNR: మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలోని శివాలయం పునర్నిర్మాణ పనులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శివాలయానికి స్వామివారిని, ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.