VSP: దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. డిమాండ్‌ను అదనుగా చేసుకొని టికెట్ల ధరలను అమాంతం పెంచేశారు. ముఖ్యంగా విశాఖ-హైదరాబాద్ మార్గంలో ధరలు ఆకాశాన్నంటాయి. థర్డ్ ఏసీ రైలు టికెట్ ధర సుమారు రూ.1,200 కాగా, ప్రైవేట్ స్లీపర్ బస్సు టికెట్ ధరను రూ.3,200 నుంచి రూ.3,600వసూలు చేస్తున్నారు.