NZB: మెండోరా మండల కేంద్రంలో శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారు బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో దాసరి మూర్తి, తమ్మల రమేష్, శ్రీనివాస్, ధర్మేందర్ సహా పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.