NDL: మహానంది మండల సర్వసభ్య సమావేశం ఈనెల 29వ తేదీ నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహబూబ్ దౌలా పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా నిన్న జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఎంపీడీవో మాట్లాడుతూ.. తిరిగి 29న నిర్వహించే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.