TPT: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు శనివారం తిరుమలకు చేరాయి. ఈ గొడుగులను హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ RR గోపాల్ జీ, TTD చైర్మన్ బీఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్లకు అందజేశారు. వరుసగా 21వ సారి శ్రీవారికి గొడుగులను సమర్పించారు.