NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ ఆధ్వర్యంలో స్థానిక 24వ డివిజన్ కనుపర్తిపాడు, 33వ డివిజన్ పొదలకూరు రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంతాలలో శనివారం సిబ్బంది కోతులు పట్టారు. 83 కోతులను పట్టుకొని జిల్లా సరిహద్దు సమీపంలోని బద్వేలు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు తెలియజేశారు.