ADB: ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన సోనుభాయి అనే గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందజేశారు. 108 సిబ్బంది రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మహిళ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినట్లు EMT విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.