WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలోని చెరువులో చేపల కోసం వేసిన వలలో భారీ కొండ చిలువ చిక్కుకొని మృతి చెందింది. శనివారం చేపల కోసం ఏర్పాటు చేసుకున్న వలలో కొండ చిలువను చూసి జాలర్లు భయందోళనకు గురయ్యారు. స్థానికులు మరికొంతమంది కలిసి కొండ చిలువను బయటకి తీశారు.