ELR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. దీంతో పోలవరం – పురుషోత్తపట్నం మధ్య నడుస్తున్న రేవు లాంచీ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భావించి రేవుల నుంచి లాంచీలను నిలిపివేశామని అధికారులు తెలిపారు.