HNK: హన్మకొండలో స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన తెలంగాణ బాపూజీ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శనివారం వారి చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి అని అన్నారు