NDL: ఆత్మకూరు సమీపంలోని సిద్దాపురం చెరువు అలుగులు దాటి నీరు ప్రవహిస్తోంది. దీంతో కర్నూలు నుంచి శ్రీశైలం, VJD వెళ్లే ప్రయాణికులు నంద్యాల మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. శ్రీశైలం నుంచి VJDకు వచ్చే వారు గిద్దలూరు మార్గంలో జిల్లాలకు చేరాలని కోరారు. కురుకుంద కొత్తపల్లె వద్ద భవనాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రి వేళల్లో వాగు దాటోద్దన్నారు.