దేశంలో ప్రతి సంవత్సరం 1.5 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు అమ్ముడవుతుంటే ఇందులో విద్యార్థుల వాటా చాలా తక్కువగా ఉందని ఓ సర్వే తెలిపింది. అమెరికాలో మాత్రం కంప్యూటర్ సేల్స్‌లో సగం వాటా విద్యార్థులదే ఉందని పేర్కొంది. కాగా, భారత్‌లో 90 శాతం యువతకు స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పటికీ, కేవలం 9 శాతం మందికే PCలు ఉన్నాయని వెల్లడించింది.