ప్రకాశం: జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు కురిసిన వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.