NDL: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అప్రమత్తతో వ్యవహరించాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. ఏదైనా ఆపద సమయంలో, పోలీస్ రక్షణ వారి సేవల కోసం 112 హెల్ప్ లైన్ నంబర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉండాలన్నారు.