W.G: ప్రభుత్వ పోరంబోకు, కాలువ గట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్ల ఫలసాయం పేదలకు స్వాధీనం చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాతిరెడ్డి జార్జ్ శుక్రవారం పెనుగొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మికులైన నిరుపేదలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి జీవనోపాధి కోసం ప్రభుత్వ భూముల్లో ఉన్న కొబ్బరి చెట్లను వారికి స్వాధీనం చేయాలన్నారు.